jupudi prabhakar: ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే రేవంత్ రెడ్డి ఇళ్లపై ఐటీ దాడులు: జూపూడి

  • పబ్బం గడుపుకోవడానికే బీజేపీ ఆ విభాగాలను వాడుకుంటుంది
  • గతంలో తమిళనాడు, కర్ణాటక నేతలను ఇబ్బంది పెట్టారు
  • బీజేపీ, టీఆర్ఎస్ మిలాఖత్ అయ్యాయి

ఎన్నికల సమయంలో తమ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ విభాగాలను వాడుకుంటుందని, ఇది వారి ఎన్నికల ఎత్తుగడలో ఒక భాగమని జూపూడి విమర్శించారు. హైదరాబాద్ లో రేవంత్ పై ఐటీ దాడులు ఆ తరహావేనన్నారు. ఓటుకు నోటు కేసని అంటున్నారని, అందులో చంద్రబాబు పేరును కూడా వారు ప్రస్తావిస్తున్నారని చెప్పారు. ఆయనపై ఎటువంటి కేసు ఫైల్ కాలేదని, కోర్టు కూడా ఆయనను నిందితునిగా పేర్కొనలేదని తెలిపారు.

గతంలో తమిళనాడులో శశికళ, పళనిస్వామి, పన్నీరు సెల్వంలను ఇబ్బంది పెట్టి తమ పబ్బం గడుపుకున్నారన్నారు. కర్ణాటకలో కుమారస్వామిని కూడా అలాగే ఇబ్బంది పెట్టారన్నారు. తెలంగాణలో జగ్గారెడ్డిపై కూడా పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ మిలాఖత్ అయి వ్యతిరేక పార్టీలపై ఎన్నికల సందర్భంగా దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు.

ఇటువంటి చర్యలను నేర ప్రవృత్తిగా భావించవలసి ఉంటుందన్నారు. ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న వారే ఇలాంటి చర్యలు చేపడతారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇలా చేయడాన్ని తాము విమర్శిస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News