alluarjun: 'నోటా' కథ ముందుగా బన్నీ దగ్గరికే వచ్చిందట!

  • కథ బాగుందని బన్నీ అన్నాడు 
  • తనకి సెట్ కాదని చెప్పాడు 
  • అప్పుడు విజయ్ దేవరకొండ దగ్గరికెళ్లానన్న దర్శకుడు

విజయ్ దేవరకొండ అభిమానులంతా కూడా ఇప్పుడు 'నోటా' సినిమా విడుదల తేదీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజకీయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాను తమిళ .. తెలుగు భాషల్లో ఒకే రోజున రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఆనంద్ శంకర్ దర్శకుడిగా వ్యవహరించాడు.

తాజాగా ఆయన మాట్లాడుతూ .. బన్నీ కొంతకాలంగా ద్విభాషా చిత్రం చేయాలని అనుకుంటున్నాడు. అందువలన ముందుగా నేను ఆయనకి ఈ కథను వినిపించానని చెప్పాడు. కథ చాలా బాగుందనీ .. అయితే ఈ తరహా కథ తనకి సెట్ కాదని బన్నీ అన్నాడట. దాంతో ఆయన ఈ కథను తీసుకుని వెళ్లి, విజయ్ దేవరకొండకి వినిపించాడట. 'తమిళంలో సినిమానా?' అంటూ విజయ్ దేవరకొండ మొదట సందేహాన్ని వ్యక్తం చేశాడనీ, ఆ తరువాత కథాకథనాల్లోని కొత్తదనాన్ని అర్థం చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెప్పాడు. వసూళ్ల పరంగా ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.    

  • Loading...

More Telugu News