Philbit: అడవిలో యువకుడిని చంపి తిన్న పులి!

  • పుట్టగొడుగుల కోసం వెళ్లగా మీదపడిన మృగం
  • గతంలోను పులుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 20 మంది రైతులు
  • డెత్‌ జోన్‌లా ఫిల్‌బిత్‌ పులుల అభయారణ్యం
 ఆహారం కోసం అడవిలోకి వెళ్లిన ఓ యువకుడిని తనకు ఆహారంగా మార్చుకుందో పులి. పుట్టగొడుగుల కోసం అడవికి వచ్చిన యువకుడిపై దాడిచేసి చంపి తినేసింది. ఫిలిభిత్‌ పులుల అభయారణ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లక్ష్మణ్‌ప్రసాద్‌ (24) అనే గిరిజన యువకుడు పుట్టగొడుగులు సేకరించేందుకు అభయారణ్యంలోకి వెళ్లాడు. అతను పుట్టగొడుగుల సేకరణలో ఉండగా సమీపంలో మాటువేసిన పులి దాడిచేసింది. చంపేసి కొంతభాగం తినేసింది.

 అడవిలోకి వెళ్లిన లక్ష్మణ్‌ప్రసాద్‌ తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అభయారణ్యంలో గాలింపు చేపట్టారు. ఓ చోట అతని సైకిలు, దానికి సమీపంలో మృతదేహం కనిపించడంతో భోరుమన్నారు.  గతంలో 20 మంది రైతులు పులుల దాడుల్లో మృతిచెందారు. గిరిజాదేవి అనే మహిళ పొలంలో పనిచేసుకుంటుండగా పులి దాడిచేయడంతో చనిపోయింది. లక్ష్మణ్‌ప్రసాద్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని, అడవి చుట్టూ కంచె నిర్మించాలన్న యోచన ఉందని అటవీ శాఖాధికారి ఆదర్శకుమార్‌ తెలిపారు.
Philbit
tiger zone

More Telugu News