umabharathi: 'వివాహేతర సంబంధం'పై సుప్రీం తీర్పుపై కేంద్రమంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు

  • భారతీయ సంప్రదాయంలో మహిళదే ఆధిపత్యం
  • సమానత్వం అన్నది మన దేశానికి వర్తించదు
  • స్త్రీలను గౌరవించలేని చోట రాక్షసులు నివాసం ఉంటారు

వివాహేతర సంబంధం నేరం కాదని, ఈ అంశంలో స్త్రీ స్వేచ్ఛకు సమాన హక్కు ఉందని, బ్రిటీష్‌ కాలంలో పుట్టుకు వచ్చిన 497 రాజ్యాంగ నిబంధన ఈ తరానికి అవసరం లేదంటూ భారత అత్యున్నత  న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర మంత్రి ఉమాభారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు.

 భారతీయ సంప్రదాయంలో మహిళదే ఆధిపత్యమని, పాశ్చాత్యదేశాల్లో అమలవుతున్న ‘సమానత్వం’ అంశం మనకు వర్తించదని అన్నారు. 'మహిళలు గౌరవం పొందని చోట రాక్షసులు నివాసం ఉంటారని అంటారు. అందుకే మన దేశంలో మహిళను ఎంతో గౌరవిస్తాం. సమాజంలో వారిదే ఆధిపత్యం. అటువంటి చోట సమాన హక్కు కల్పించాలంటూ కోర్టుకు వెళ్లడం సరికాదు. అసలు ప్రతి విషయానికి ఈ జనం కోర్టునెందుకు ఆశ్రయిస్తారో అర్థం కాదు' అని వ్యాఖ్యానించారు. బ్రిటీష్‌ కాలంనాటి ఏకపక్ష పురాతన నిబంధన సెక్షన్‌ 497 అని సుప్రీం కోర్టు దాన్ని కొట్టేసిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News