Balakrishna: ఫేమస్ కావాలని బాలకృష్ణ ఇంట్లో దొంగతనానికి మాస్టర్ ప్లాన్ వేసిన ఘరానా దొంగ!

  • బెంగళూరులో పట్టుబడ్డ ఘరానా దొంగ కర్రి రాజేష్
  • హైదరాబాద్ లో 12 కేసులు పెండింగ్ లో 
  • పట్టుబడకుంటే బాలయ్య ఇంట్లో ఈపాటికే దొంగతనం

అతని పేరు కర్రి రాజేష్ అలియాస్ సత్తిబాబు, అలియాస్ బుజ్జి. ఘరానా దొంగ. ఇప్పటికే హైదరాబాద్, బంజారాహిల్స్ లోని సంపన్నుల ఇళ్లలో దొంగతనాలు చేశాడు. గత నెలలో బంజారాహిల్స్ లోని డాక్టర్‌ రామారావు, వెంకట్‌రెడ్డి, షీలా అర్మానీ, అశ్వినీరెడ్డి ఇళ్లలో దొంగతనాలు చేసింది ఇతనే. వీరు మాత్రమే కాదు. కర్ణాటక రిటైర్డ్ డీజీ శ్రీనివాసులు, టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కూడా సతీశ్ బాధితులే.

 బెంగళూరులో దొంగతనం చేసి పట్టుబడి జైల్లో ఉన్న సతీశ్ ను, ఇక్కడి పోలీసులు సీసీటీవీ కెమెరాల సాయంతో గుర్తించి, అక్కడికి వెళ్లి విచారించారు. అతన్నుంచి పలు కీలక విషయాలను రాబట్టారు. తనకు జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్న హీరో నందమూరి బాలకృష్ణ ఇంట్లో దొంగతనం చేయాలని ఉందని, ఆ ఇంట్లో చోరీ చేస్తే పాప్యులర్ కావచ్చని అనుకుంటున్నానని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. బెంగళూరులో అరెస్ట్ కాకుంటే, సతీష్, తిరిగి హైదరాబాద్ వచ్చి, బాలయ్య ఇంట్లో చోరీకి ప్రయత్నించేవాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

ఇతనిపై బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ల పరిధిలో 12 కేసులు ఉన్నాయి. 2016, డిసెంబర్ 2న అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపగా, సెప్టెంబర్ 14న విడుదలై, ఆ తెల్లవారే డాక్టర్ రామారావు ఇంట్లో దొంగతనం చేసి, రూ. కోటి విలువైన సొత్తు అపహరించాడు. సతీష్ బెంగళూరులో పట్టుబడటంతో హైదరాబాద్ పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News