Amitabh Bachchan: నేనేమీ తనుశ్రీని కాదు, నానా పటేకర్ నూ కాదు: అమితాబ్

  • 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా బిగ్ బీ
  • తనుశ్రీ దత్తా ఆరోపణలపై ప్రశ్నించిన మీడియా
  • తానెలా కామెంట్ చేస్తానన్న అమితాబ్
తన తాజా చిత్రం 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, పరిశ్రమలో తీవ్ర చర్చకు లేపిన తనుశ్రీ దత్తా వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. గురువారం నాడు సినిమా ట్రయిలర్ విడుదల కాగా, ఈ సందర్భంగా మీడియా ఆయన్ను తనుశ్రీ దత్తా విషయమై ప్రశ్నించింది.

దీనిపై కాస్తంత వ్యంగ్యంగా స్పందించిన అమితాబ్, "నేనేమీ తనుశ్రీని కాదు. నానా పాటేకర్‌ను కాదు. దీనిపై నేనెలా కామెంట్ చేస్తా" అని అమితాబ్ అన్నారు. ఆపై ఇదే ప్రశ్న అక్కడే ఉన్న మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్‌ ఖాన్ కు కూడా ఎదురైంది. తనకు విషయం తెలియదని, తెలియకుండా తాను ఏమీ మాట్లాడబోనని, అయితే, ఇటువంటివి జరిగినపుడు, వాటిని విన్నప్పుడు కొంత బాధ కలుగుతుందని అన్నారు.
Amitabh Bachchan
Amir Khan
Thugs Of Hindusthan

More Telugu News