medical shops: దేశవ్యాప్తంగా రేపు మెడికల్ షాపుల బంద్

  • ఆన్ లైన్ లో మందుల అమ్మకంపై నిరసన
  • ఏఐఓసీడీ పిలుపు మేరకు బంద్
  • మద్దతిచ్చిన 'ద తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్'

దేశ వ్యాప్తంగా రేపు మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆన్ లైన్ లో మందుల అమ్మకం, ఈ-ఫార్మసీ విధానాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐఓసీడీ) ఇచ్చిన పిలుపు మేరకు రేపు మెడికల్ షాపులు బంద్ పాటించనున్నాయి. ఈ బంద్ కు 'ద తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్' (టీటీసీడీఏ) సంస్థ కూడా మద్దతు ప్రకటించింది. ఆన్ లైన్ లో మందులు విక్రయించడం డ్రగ్స్ చట్టం నిబంధనకు వ్యతిరేకమని పేర్కొన్న టీటీసీడీఏ ప్రతినిధులు, ఇరవై నాలుగు గంటల పాటు ఈ బంద్ కొనసాగనుందని, ప్రజలు నిత్యం వినియోగించే మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News