eetala: నవంబరు చివరిలోగా ఎన్నికలు వస్తాయనిపిస్తోంది!: ఈటల రాజేందర్

  • వచ్చే ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారు
  • చాలాచోట్ల ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవు
  • మేము చేసిన అభివృద్ధి ప్రజలకు కనిపిస్తోంది

ఎన్నికల కమిషన్ వేగం చూస్తుంటే, నవంబరు చివరిలోగా ఎన్నికలు వస్తాయనిపిస్తోందని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు.

టీఆర్ఎస్ ను ఓడించాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు మహాకూటమిని ఏర్పాటు చేసుకోవడంలోనే తమ విజయం స్పష్టమైపోయిందన్నారు. రాజకీయాల్లో ఒకటి ప్లస్ ఒకటి.. రెండు కాకపోవచ్చని, 2009లో ఇదే జరిగిందని చెప్పుకొచ్చారు. తమ గురించి ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా తాము చేసిన అభివృద్ధి ప్రజలకు కళ్ల ముందే కనిపిస్తోందని చెప్పారు. టీఆర్ఎస్ లో వర్గాలు ఉన్నాయన్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ, వైరుధ్యాలు సహజమేనని, అవి ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయని అన్నారు. విపక్ష నేతలపై కేసులపై ఈటల స్పందిస్తూ.. తప్పు చేసిన వారు శిక్ష తప్పించుకోలేరని అన్నారు.

More Telugu News