కేసీఆర్ తొత్తు గవర్నర్ నరసింహన్: వీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు

27-09-2018 Thu 14:33
  • కేసీఆర్ కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు చేస్తే వేల కోట్లు దొరుకుతాయి
  • రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు
  • అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకుంటాం

టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతున్నట్టుగా లేదని... పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనసాగుతున్నట్టుగా ఉందని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు గవర్నర్ నరసింహన్ తొత్తులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు చేస్తే, వేల కోట్ల రూపాయలు దొరుకుతాయని చెప్పారు. రేవంత్ రెడ్డి ఇళ్లలో సోదాలు ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు.