Baba ramdev: వ్యాపార విస్తరణ యోచనలో బాబారామ్‌దేవ్‌ : వస్త్రాల మార్కెట్‌పై దృష్టి

  • పతంజలి పరిధాన్‌ పేరుతో ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ అవుట్‌లెట్‌లు
  • ప్రముఖ పట్టణాల్లో తెరిచేందుకు సన్నాహాలు
  • త్వరలో ప్రాంచైజీల ఎంపిక
వ్యాపార విస్తరణలో భాగంగా వస్త్ర మార్కెట్‌లోకి ప్రవేశించాలని యోగా గురువు బాబారామ్‌దేవ్‌ నిర్ణయించారు. ఇందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. ‘పతంజలి పరిథాన్‌’ పేరుతో ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ అవుట్‌ లెట్‌లను తెరవాలని నిర్ణయించినట్లు రామ్‌దేవ్‌ ట్వీట్‌ చేశారు.

దేశంలోని ప్రముఖ పట్టణాలన్నింటా అవుట్‌లెట్లు తెరిచి ప్రాంచైజీలకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి సంస్థ ఇటీవలే టెలికాం రంగంలోకి అడుగు పెట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్‌తో జతకట్టి ‘స్వదేశీ సమృద్ధి సిమ్‌ కార్డును’ జారీ చేసిన విషయం తెలిసిందే. డెయిరీ వ్యాపారం నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు.
Baba ramdev
patanjali

More Telugu News