tourism: పర్యాటకంలో రారాజు ఆంధ్రానే.. జాతీయ టూరిజం అవార్డును అందించిన కేంద్రం!

  • ప్రదానం చేసిన కేంద్ర మంత్రి అల్ఫోన్స్
  • గతేడాది కూడా అవార్డును కొల్లగొట్టిన ఏపీ
  • టూరిజం అభివృద్ధిలో విశేష కృషికి అవార్డు

ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. రాష్ట్ర విభజన జరిగి కీలక పర్యాటక ప్రాంతాలు కోల్పోయినా ఏపీ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. 2018 ఏడాదికి గానూ ఆంధ్రప్రదేశ్ ‘ఉత్తమ జాతీయ టూరిజం అవార్డు’ అందుకుంది. కేంద్ర పర్యాటక సహాయ మంత్రి అల్ఫోన్స్ నుంచి ఈ అవార్డును ఏపీకి అందజేశారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ ఈ అవార్డును అందుకున్నారు.

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈ రోజు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసినందుకు జాతీయ టూరిజం అవార్డు-2018ను ఆంధ్రప్రదేశ్ అందుకుంది. ఇప్పుడే కాదు గతేడాది కూడా జాతీయ పర్యాటక అవార్డును ఏపీనే దక్కించుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News