Chandrababu: విభజన సవాళ్లు ఎదుర్కొని అభివృద్ధి దిశగా అడుగులు: సీఎం చంద్రబాబు

  • 2029 నాటికి ఏపీని దేశంలో నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం
  • విద్యుత్‌ మిగులు సాధించడంతో నిల్వపై దృష్టి
  • అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ప్రసంగం

'రాష్ట్ర విభజన అనంతరం ఏపీ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. అన్నింటినీ అధిగమించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం నాలుగో రోజు కొలంబియా యూనివర్సిటీలో ప్రసంగించారు. 2029 నాటికి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దడమే తన ముందున్న లక్ష్యమని, ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు.

రహదారుల అనుసంధానంతో పల్లెపల్లెకూ రవాణా సదుపాయాలు మెరుగుపర్చినట్లు చెప్పారు. వర్షపునీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెరిగేలా చూడగలిగామని, నదుల అనుసంధానంతో చరిత్ర సృష్టించామని తెలిపారు. ఒకప్పుడు కరెంటు కోతతో సతమతయ్యే రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ సాధించి నిల్వ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఆధార్‌ అనుసంధానంతో ప్రభుత్వ పథకాలన్నీ అర్హులకే అందేలా చేస్తున్నామని, ప్రజలే ప్రథమం అన్న నినాదంతో రియల్‌టైం గవర్నెన్స్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పనితీరుపై 73 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని, ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తామన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధిస్తోందని, 15 శాతం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News