Asaduddin Owaisi: మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీనే.. మరోసారి ఏకగ్రీవమైన ఎన్నిక!

  • పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన అసద్
  • తండ్రి మరణంలో పార్టీ బాధ్యతలు
  • 2008లో తొలిసారి అధ్యక్షుడైన అసద్
ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అధ్యక్షుడిగా హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష పదవికి సెప్టెంబర్ 22 నుంచి 24 వరకూ గడువు ఇచ్చినప్పటికీ అసద్ కాకుండా మరెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. నామినేషన్ గడువు ముగియడంతో అసదుద్దీన్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి, మాజీ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ ప్రకటించారు.

2008లో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు సలావుద్దీన్ ఒవైసీ కన్నుమూయడంతో ఆయన పెద్ద కుమారుడు అసదుద్దీన్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. పార్టీ నిబంధనల మేరకు ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. మజ్లిస్ పార్టీ చీఫ్ గా అసదుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఇది మూడోసారి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అసద్ కు పార్టీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.
Asaduddin Owaisi
aimim
party
president
elections

More Telugu News