Warangal Urban District: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పొగలు.. పరుగులు తీసిన రోగులు, బంధువులు!

  • చిన్న పిల్లల వార్డులో చెలరేగిన పొగ
  • షార్ట్ సర్క్యూట్ గా అనుమానం
  • సహాయక చర్యల్లో అగ్నిమాపక సిబ్బంది
వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఈ రోజు ఉదయం పొగలు వ్యాపించాయి. తొలుత చిన్నపిల్లల వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో పొగ వ్యాపించింది. దీంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు తమ చిన్నారులను తీసుకుని హుటాహుటిన బయటకు పరుగులు తీశారు. మిగతా రోగులను సైతం ఆసుపత్రి సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Warangal Urban District
mgm hospital
smoke
kidsward

More Telugu News