Revanth Reddy: రేవంత్ ఇంటి వద్దకు భారీగా అభిమానులు... ఉద్రిక్త వాతావరణం!

  • ఉదయం నుంచి రేవంత్, ఆయన బంధువుల ఇళ్లలో సోదాలు
  • రాజకీయ కక్ష సాధింపేనంటున్న అభిమానులు
  • బందోబస్తు కట్టుదిట్టం చేసిన పోలీసులు
తమ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ, ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమానులు, పెద్దఎత్తున కొడంగల్ లోని ఇంటి వద్దకు చేరుకుంటుండటంతో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవంత్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఈ సోదాలేంటని, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోదాలకు వచ్చారని అభిమానులు విమర్శిస్తున్నారు.

 సోదాల విషయం తమకు ముందుగా తెలియదని అంటున్న పోలీసులు, ఆయన ఇంటి వద్ద బందోబస్తును కట్టుదిట్టం చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మూడు చోట్ల సోదాలు జరుగుతున్నాయని సమాచారం.
Revanth Reddy
Fans
Kodangal
Hyderabad

More Telugu News