india: 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడోస్థానం!

  • భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగవంతం
  • 2017లో ఆరో స్థానంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ
  • 2030 నాటికి జపాన్‌ను అధిగమించనుంది  

2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూడో స్థానంలో నిలిచే అవకాశాలున్నాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. హెచ్ఎస్‌బీసీ హోల్డింగ్స్, బ్లూమ్‌బెర్గ్ నిర్వహించిన అధ్యయనంలో పలు కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోందని.. దీనికి కారణం దేశంలో పని చేయగలిగిన సామర్థ్యం ఉన్న జనాభా పెరగడమేనని స్పష్టమైంది. మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఇదే ప్రోత్సాహకారి అని అధ్యయనంలో తేలింది.

ఇక 2030నాటికి చైనా ఆర్థిక వ్యవస్థ ప్రథమ స్థానం... అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండో స్థానం... భారతదేశ ఆర్థిక వ్యవస్థ మూడో స్థానంలోనూ నిలుస్తాయని ఈ అధ్యయనం అంచనా వేసింది. 2017లో ఆరో స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి జపాన్‌ను అధిగమించబోతున్నట్లు ఈ అధ్యయనం అంచనా వేసింది.

More Telugu News