governer: గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ

  • రాజ్ భవన్ లో గవర్నర్ తో కేసీఆర్ సమావేశం
  • తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ?
  • ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ 
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ ఈరోజు భేటీ అయ్యారు. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన కేసీఆర్, ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పాలన, ముందస్తు ఎన్నికల సన్నాహకాలతో పాటు ఇతర అంశాలపై కూడా వారు చర్చించినట్టు సమాచారం. ఇదిలా ఉండగా, రేపటి నుంచి తెలంగాణ శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ ని కేసీఆర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
governer
kcr

More Telugu News