divya spandana: కన్నడ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు దివ్యపై రాజద్రోహం కింద కేసు నమోదు

  • కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్ గా ఉన్న దివ్య స్పందన
  • మోదీ దొంగ అంటూ వ్యాఖ్యలు
  • లక్నోలో నమోదైన కేసు
ప్రముఖ కన్నడ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చీఫ్ దివ్య స్పందనపై లక్నోలోని గోమ్తినగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సెక్షన్ 124-ఏ (రాజద్రోహం), సెక్షన్ 67 కింద ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 ప్రధాని మోదీని ఉద్దేశించి 'దొంగ' అని ట్వీట్ చేసినందుకు దివ్యపై సయ్యద్ రిజ్వాన్ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానిని తీవ్రంగా అవమానించినందుకే పోలీసులకు ఫిర్యాదు చేశానని రిజ్వాన్ తెలిపారు. ఈ కేసుపై దివ్య స్పందిస్తూ... 'నిజమా.. చాలా మంచిది' అంటూ ట్వీట్ చేశారు. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో మోదీని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
divya spandana
cogress
case
fir
modi
Rahul Gandhi

More Telugu News