Konda Surekha: కొండా సురేఖకు ప్రచార కమిటీలో స్థానం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • రాష్ట్రమంతా తిరిగి సురేఖ ప్రచారం చేస్తారు
  • ఐదు నియోజకర్గాలపై సురేఖ ప్రభావం ఉంటుంది
  • సురేఖ నాయకత్వంపై రాహుల్ కు నమ్మకం ఉంది
బేషరతుగానే కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొండా దంపతులకు పార్టీలో గౌరవప్రదమైన స్థానం ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రచార కమిటీలో సురేఖకు స్థానం కల్పిస్తామని... రాష్ట్రమంతా తిరిగి ఆమె పార్టీ తరపున ప్రచారం చేస్తారని తెలిపారు. కొండా దంపతుల చేరికతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయిందని చెప్పారు. కొండా సురేఖ సమర్థవంతమైన బీసీ నాయకురాలని... ఆమె ప్రభావం ఐదు నియోజకవర్గాలపై ఉంటుందని రాహుల్ భావిస్తున్నారని తెలిపారు. సురేఖ సమర్థవంతమైన నాయకత్వంపై రాహుల్ కు నమ్మకం ఉందని చెప్పారు.
Konda Surekha
Rahul Gandhi
Uttam Kumar Reddy

More Telugu News