Vivo V9 Pro: అదిరిపోయే ఫీచర్లతో 'వివో వి9 ప్రో' స్మార్ట్ ఫోన్ విడుదల!

  • బ్లాక్ కలర్ వేరియంట్ లో లభ్యం
  • ధర రూ.17,990
  • అమెజాన్, ఆఫ్ లైన్ స్టోర్లలో లభ్యం

వివో నుండి నూతన స్మార్ట్ ఫోన్ విడుదలైంది. 'వివో వి9 ప్రో' పేరిట విడుదలైన ఈ ఫోన్ బ్లాక్ కలర్ వేరియంట్ లో రూ.17,990కి మార్కెట్లో లభించనుంది. ఇటీవలి కాలంలో వివో నుండి తక్కువ ధరకు విడుదలైన స్మార్ట్ ఫోన్లలో ఇది ఒకటి. ఆఫ్ లైన్ స్టోర్లతో పాటు అమెజాన్ సైట్‌లో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. పలు ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉన్న ఈ ఫోన్ 'షియోమి ఎంఐ ఏ2'కి గట్టి పోటీ ఇవ్వనుంది.

వివో వి9 ప్రో ప్రత్యేకతలు:

  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
  • 6.3" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (2280 x 1080 రిజల్యూషన్)
  • 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (256 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (ఫన్ టచ్ ఓఎస్ 4.0)
  • 13/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
  • 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 3260 ఎంఏహెచ్ బ్యాటరీ

More Telugu News