Saina Nehwal: సైనా నెహ్వాల్ ప్రేమ వివాహం.. ముహూర్తం ఖరారు!

  • స్టార్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ తో సైనా పెళ్లి
  • గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న జంట
  • ప్రేమకు ఇరు కుటుంబాల గ్రీన్ సిగ్నల్

భారత అగ్రశ్రేణి షట్లర్ సైనా నెహ్వాల్ పెళ్లిపీటలు ఎక్కబోతోంది. తన సహ ఆటగాడు, బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ ను ఆమె వివాహం చేసుకోనుంది. వీరిద్దరూ గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. .వీరి కుటుంబాల మధ్య కొంతకాలంగా వివాహానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి.

డిసెంబర్ 16న వీరి వివాహం జరగనున్నట్టు సమాచారం. అతికొద్ది మంది సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. డిసెంబర్ 21న రిసెప్షన్ కార్యక్రమం వుంటుంది. రిసెప్షన్ కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు. పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీలో 2005లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది.  

  • Loading...

More Telugu News