Mohan Babu: నటుడు మోహన్ బాబును పరామర్శించిన టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • ఇటీవల మరణించిన మోహన్ బాబు తల్లి
  • తిరుపతిలో జరుగుతున్న ఉత్తర క్రియలు
  • సానుభూతి తెలిపిన బుద్ధా వెంకన్న
ప్రస్తుతం తిరుపతి, రంగంపేటలో ఉన్న తన నివాసంలో తల్లి ఉత్తర క్రియల్లో పాల్గొంటున్న సినీ నటుడు మోహన్‌ బాబును తెలుగుదేశం ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ బుద్ధా వెంకన్న పరామర్శించారు. ఇటీవల మోహన్‌ బాబు తల్లి లక్ష్మమ్మ అనారోగ్య కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన్ను పరామర్శించేందుకు బుద్ధా వెంకన్న వెంట ఆయన కుమారుడు వరుణ్ కూడా తిరుపతికి వచ్చారు. మోహన్‌ బాబును ఆయన నివాసంలో కలిసిన వెంకన్న, మోహన్ బాబు కుటుంబానికి సానుభూతి తెలిపారు.
Mohan Babu
Buddha Venkanna
Mother
Died

More Telugu News