Paderu: మావోల టార్గెట్ గిడ్డి ఈశ్వరి... భద్రత పెంపు!

  • ఏజన్సీ ప్రాంతంలో భద్రత పెంపు
  • గిడ్డి ఈశ్వరికి అదనపు భద్రత
  • ఇంటిముందు సాయుధులైన పోలీసుల కాపలా
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్య తరువాత, ఏజన్సీ ప్రాంతంలో పోలీసులు భద్రతను పెంచారు. మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి అదనపు భద్రత కల్పించారు. పాడేరులోని ఆమె ఇంటివద్ద సాయుధులైన పోలీసులను కాపలా ఉంచారు. ఎక్కడికైనా పర్యటనలకు వెళ్లినపుడు తమకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని పోలీసుశాఖ గిడ్డి ఈశ్వరిపై ఆంక్షలు విధించింది. ఎమ్మెల్యేకు ఇప్పుడున్న గన్‌ మెన్‌ లతో పాటు అదనంగా మరో గన్‌ మెన్‌ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
Paderu
Araku
Giddi Eshwari

More Telugu News