Harish Rao: కొండపోచమ్మ ప్రాజెక్టును అడ్డుకునేందుకు కోదండరాం యత్నం: హరీష్ రావు

  • 60 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలోనే జరిగింది
  • ఒక్క ఓటుతో బుద్ధి చెప్పాలి
  • అన్ని కుట్రలను ఛేదించాం
కొండపోచమ్మ ప్రాజెక్టును అడ్డుకునేందుకు టీజేఎస్ నేత కోదండరాం ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. అయితే తాము అన్ని కుట్రలను ఛేదించామని ఆయన పేర్కొన్నారు. ములుగులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ 60 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందన్నారు. ఒక్క ఓటుతో నాలుగు పార్టీలకూ బుద్ధి చెప్పాలన్నారు. ప్రతి ఇంటికీ తాగు నీరు అందిస్తున్నామని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలెన్నో ప్రవేశపెట్టామన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో హార్టీకల్చర్ వర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ నెలకొల్పామని హరీష్ రావు తెలిపారు.  

Harish Rao
TRS
Kodandaram
TJS

More Telugu News