Pranay: నల్గొండలో ఆర్యవైశ్యుల భారీ ర్యాలీ... జైలుకెళ్లి మారుతీరావుతో ములాకత్!

  • విగ్రహ ఏర్పాటు వద్దు
  • తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతింటాయి
  • అడ్డుకుని తీరుతామన్న వైశ్య సంఘాల ప్రముఖులు

మిర్యాలగూడ సెంటర్ లో పరువు హత్యకు గురైన ప్రణయ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చకచకా ఏర్పాట్లు సాగుతున్న వేళ, ఆర్యవైశ్యులు ఘాటుగా స్పందించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావుకు మద్దతు పలుకుతూ, నల్గొండలోని వాసవీ భవన్ నుంచి జైలు వరకూ ర్యాలీ నిర్వహించారు. ప్రణయ్ విగ్రహ ఏర్పాటు వద్దంటూ కలెక్టరేట్ లో, ఎస్పీ కార్యాలయంలో వినతిపత్రాలను అందించారు. ఆపై మారుతీరావును ఉంచిన జైలుకు వెళ్లి, ఆయన్ను, ఆయన సోదరుడు శ్రవణ్ నూ పలకరించారు. మిర్యాలగూడలో ప్రణయ్ విగ్రహం ఏర్పాటు చేస్తే, తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతింటాయని వైశ్య సంఘాల ప్రముఖులు వ్యాఖ్యానించారు. విగ్రహ ఏర్పాటును అడ్డుకుని తీరుతామని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News