thief: ‘స్మార్ట్’ దొంగ.. రూ.10 లక్షల విలువైన ఫోన్లను తస్కరించిన యువకుడు!

  • అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
  • 50 ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
  • పనిదొరక్క దొంగగా మారిన యువకుడు
బతుకుదెరువు కోసం వలస వచ్చిన ఓ యువకుడు దొంగతనాల బాట పట్టాడు. ఖరీదైన స్మార్ట్ ఫోన్లే లక్ష్యంగా నాలుగు డజన్ల ఫోన్లను కొట్టేశాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.

జార్ఖండ్ కు చెందిన విశాల్ కుమార్ గంగారాం మహంతో(19) కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ముంబైకి వలస వచ్చాడు. పని దొరక్కపోవడంతో దొంగ అవతారం ఎత్తాడు.  నగరంలోని గందేవి, కాలాచౌక్, మలాద్, కండివళి, బోరివలి, దహిసర్, మీరారోడ్డు, విరార్ ప్రాంతాల్లో చేతివాటం చూపి 50 ఖరీదైన స్మార్ట్ ఫోన్లను తస్కరించాడు. ఫోన్ల చోరీపై పలు ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఈ విషయంపై దృష్టి సారించారు. చివరికి మహంతోను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కటకటాల వెనక్కు నెట్టారు.
thief
mumbai
Police
smart phones
rs.10 lakhs

More Telugu News