France: రాఫెల్‌ ఒప్పందంపై ప్రాంకోయిస్‌ హోలేండే వ్యాఖ్యలు నష్టదాయకమే: ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి

  • దుమారం రేపుతున్న ప్రాన్స్‌ మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలు
  • ఇవి ఎవరికీ మేలుచేయవన్న ఫ్రాన్స్ 
  • ఇరు దేశాల సంబంధాలపై తీవ్రపభ్రావం చూపే అవకాశముందన్న మంత్రి   

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై ప్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ప్రాంకోయిస్‌ హోలేండే చేసిన వ్యాఖ్యలు విదేశీ సంబంధాల విషయంలో తమ దేశానికి నష్టదాయకమేనని ప్రాన్స్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి జీన్‌ బాప్టిస్ట్‌ లేమోన్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం విషయంలో స్థానిక భాగస్వామిగా అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేసుకోవాల్సిందిగా డసాల్ట్‌ కంపెనీకి భారత ప్రభుత్వమే సూచించిందని హోలేండే చేసిన వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయ దుమారం రేపుతున్న విషయం తెలిసిందే.

ఈ పరిస్థితి ఇరుదేశాల మధ్య సంబంధాలను నష్టపరుస్తుందన్న భయాన్ని ప్రాన్స్‌ వ్యక్తం చేసింది. ‘హోలేండే వ్యాఖ్యలను గమనించాను. ఇవి ఎవరికీ మేలుచేయవు. ముఖ్యంగా ఫ్రాన్స్‌కు అసలు మేలు చేయవు. పైగా ఇరుదేశాల వ్యూహాత్మక సంబంధాలకు నష్టదాయకంగా పరిణమించే అవకాశం ఉంది’ అని బాప్టిస్ట్‌ లేమోన్‌ రేడియో-జేతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. 

More Telugu News