ananth sriram: 'పచ్చ బొట్టేసిన' పాట చాలా ఇబ్బంది పెట్టేసింది: అనంత్ శ్రీరామ్

  • హీరో గిరిజనుల మధ్య పెరిగాడు 
  • హీరోయిన్ విప్లవకారుల మధ్య పెరిగింది 
  • సమతుల్యత సాధించడానికి సమయం పట్టేసింది
పాత్రల స్వరూప స్వభావాలను .. సందర్భాలను దృష్టిలో పెట్టుకుని పాటలు రాయడంలో అనంత్ శ్రీరామ్ ఎంతో ప్రత్యేకత చూపిస్తుంటాడు. ప్రత్యేకమైన ఆయన శైలి పాలమీగడలో పంచదారలా అనిపిస్తుంది .. ఆ తీయదనమే మనసులను పట్టుకుంటూ ఉంటుంది. తాజాగా ఆయన 'చెప్పాలని వుంది' కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

"నా కెరియర్లో ఇంతవరకూ నన్ను బాగా ఇబ్బంది పెట్టేసిన పాట .. 'బాహుబలి'లోని 'పచ్చబొట్టేసిన' పాట. ఈ పాటకు నేను పూర్తి రూపాన్ని తీసుకురావడానికి 73 రోజులు పట్టింది. గిరిజనుల మధ్య పెరిగిన నాయకుడు .. విప్లవకారుల మధ్యలో పెరిగిన నాయిక. వాళ్లిద్దరి మధ్య సమతుల్యాన్ని పాటించే పదజాలం ఏది వాడాలనే మీమాంసకే ఎక్కువ సమయం పట్టేసింది" అంటూ చెప్పుకొచ్చాడు.  
ananth sriram

More Telugu News