naini: తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేదు: మంత్రి నాయిని

  • ఇక్కడ శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి
  • ప్రజాప్రతినిధులకు పూర్తి రక్షణ కల్పిస్తాం
  • ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలపై నాయిని ఖండన

అరకులో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలను తెలంగాణ హోం మంత్రి నాయిని నర్శింహారెడ్డి ఖండించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం లేదని, ఇక్కడ శాంతిభద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో ప్రజాప్రతినిధులకు పూర్తి రక్షణ కల్పిస్తామని అన్నారు. కాగా, ఎమ్మెల్యే కిడారి హత్యతో తెలంగాణలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనల వివరాలను పోలీసులు కోరినట్టు తెలుస్తోంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచనున్నారు.  

ఇదిలా ఉండగా, అరకులో పరిస్థితులను పోలీస్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విశాఖ బేస్ క్యాంప్ నుంచి 6 ప్రత్యేక బృందాలను అరకుకు పంపే విషయమై హోం శాఖ ఆలోచిస్తుంది. అవసరమైతే, గ్రేహౌండ్స్ ను కూడా రంగంలోకి దించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News