మావోయిస్టుల చర్యను ఖండిస్తున్నా: ఏపీ స్పీకర్ కోడెల

23-09-2018 Sun 15:07
  • మావోయిస్టులు సిద్ధాంతపరంగా పోరాడాలి
  • హత్యలతో వారు సాధించేదేమీ ఉండదు
  • సర్వేశ్వరరావు మృతి చెందడం చాలా బాధగా ఉంది

అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటనను ఏపీ స్పీకర్ కోడెల ఖండించారు. మావోయిస్టుల చర్యను ఖండిస్తున్నానని, హత్యలతో వారు సాధించేదేమీ ఉండదని, సిద్ధాంతపరంగా పోరాడాలి కానీ, ఇలాంటి ఘాతుకాలకు పాల్పడటం సరికాదని అన్నారు. మావోయిస్టులు మూకుమ్మడిగా ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారంటే తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. సర్వేశ్వరరావు అంటే తనకు చాలా ఇష్టమని, నమ్మకమైన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి మృతి చెందడం చాలా బాధగా ఉందని అన్నారు.