modi: దొంగల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటమా!: నిర్మలాసీతారామన్

  • కాంగ్రెస్ హయాంలో తప్పులను మాపైకి నెడతారా?
  • ‘రాఫెల్’ ఒప్పందంపై అవకతవకలు జరగలేదు
  • ఈ విషయాన్ని రాహుల్ రాజకీయం చేస్తున్నారు

‘రాఫెల్’ వ్యవహారంలో ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, రాహుల్ పై కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొంగల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమంటూ రాహుల్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంత నీతివంతంగా పాలించి ఉంటే.. ‘రాఫెల్’పై ఇంత రాద్ధాంతం ఎందుకు జరిగేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో తప్పులు చేసి ఇప్పుడు వాటిని బీజేపీపైకి నెడుతున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాఫెల్’ ఒప్పందంపై అవకతవకలు జరగలేదని చెబుతున్నా ఈ విషయాన్ని రాహుల్ రాజకీయం చేస్తున్నారని, ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తిని దొంగగా చిత్రీకరించడం సబబు కాదని హితవు పలికారు. అధికారం కోల్పోయేసరికి ‘కాంగ్రెస్’ కు పిచ్చిపట్టిందని, అందుకే, రాద్ధాంతం చేస్తోందని అన్నారు. తమ ప్రభుత్వంలో అవినీతి ఎప్పుడూ, ఎక్కడా జరగలేదని నిర్మలా సీతారామన్ అన్నారు.

More Telugu News