Biggboss: కౌశల్ కాదట... బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది రోల్ రైడా!

  • ముగింపు దశకు చేరుకున్న బిగ్ బాస్
  • కౌశల్ బయటకు వెళుతున్నాడని వార్తలు
  • కాదంటున్న ఫ్యాన్స్, రోల్ రైడా వెళ్లిపోయాడని పోస్టులు
తెలుగు టీవీ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్న బిగ్ బాస్ సీజన్-2 ముగింపు దశకు చేరుకున్న వేళ, ఈ వారంలో రోల్ రైడా ఎలిమినేట్ అవుతున్నట్టు తెలుస్తోంది. తొలుత కౌశల్ ఎలిమినేట్ అవుతున్నాడని వార్తలు వచ్చినప్పటికీ, కౌశల్ కాదని, రోల్ రైడాను బయటకు పంపుతున్నారని, ఇప్పటికే నేటి ఎపిసోడ్ చిత్రీకరణ పూర్తయిందని, ఆదివారం ప్రసారమయ్యే హోస్ట్ నాని ఎపిసోడ్ ను చిత్రీకరించిన వేళ, ఆడియన్స్ గా ఉన్న వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బిగ్ బాస్ లో ఇంతకాలమూ ఎంటర్ టెయినర్ గా గుర్తింపు తెచ్చుకుని ఎలిమినేట్ కాకుండా బయటపడుతూ వచ్చిన రోల్ రైడా, గుడ్లు జాగ్రత్త టాస్క్ లో ఓడిపోవడంతో, ఫైనల్ వారానికి వెళ్లే అవకాశాన్ని మిస్ చేసుకున్నాడని, ఈ వారంలో దీప్తి నల్లమోతు, గీతా మాధురి కన్నా రోల్, సామ్రాట్ లకు తక్కువ ఓట్లు రావడం, ఇప్పటికే సామ్రాట్ గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించడంతో రోల్ వెళ్లిపోనున్నాడని తెలుస్తోంది. రోల్ వెళ్లిపోతే, బిగ్ బాస్ లో ఫైనల్ వీక్ లో తనీష్, గీత, దీప్తి, కౌశల్, సామ్రాట్‌ ల మధ్య పోటీ సాగుతుంది.
Biggboss
Rol Raida
Koushal
Taneesh
Deepti
Geeta Madhuri
Nani

More Telugu News