Rafel: బోఫోర్స్ ను మించిన రాఫెల్‌ స్కాంకు మోదీయే ఆధ్యుడు : కరణ్‌ థాఫర్‌

  • ప్రధాని కనుసన్నల్లోనే వ్యవహారం అంతా నడిచింది
  • ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడే కుంభకోణాన్ని బయటపెట్టారు
  • ఈ భారీ అవినీతిని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లే సత్తా రాహుల్‌కు లేదనిపిస్తోంది

బోఫోర్స్ ను మించిన రాఫెల్‌ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా ప్రధాని నరేంద్రమోదీనే అని ప్రముఖ పాత్రికేయుడు కరణ్‌థాపర్‌ అన్నారు. ప్రధాని కనుసన్నల్లోనే ఈ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ప్రక్రియ నడిచిందని విమర్శించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్‌ ద ప్రెస్‌’ లో కరణ్‌ థాపర్‌ మాట్లాడుతూ బోఫార్స్‌ కుంభకోణాన్ని స్వీడిష్‌ పాత్రికేయుడు వెలుగులోకి తెస్తే రాఫెల్‌ స్కాంను సాక్షాత్తు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడే బయటపెట్టారని అన్నారు. ఫ్రాన్స్ ప్రభుత్వానికి మోదీ ప్రభుత్వం రెండో అవకాశం ఇవ్వకుండా తమకు కావాల్సిన వారికి లబ్ధిచేకూర్చిందని ఆరోపించారు.

అప్పట్లో బోఫార్స్‌ కుంభకోణాన్ని విపక్షాలు క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్లగలిగాయని, రాఫెల్‌ను ఆ స్థాయికి తీసుకువెళ్లే సత్తా కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీలో తనకు కనిపించడం లేదన్నారు.   2007లో ఓ ఇంటర్వ్యూలో తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మోదీ వెళ్లిపోయారని, ఆ తర్వాత ఎప్పుడూ తాను మోదీని కలవలేదని కరణ్‌థాపర్‌ అన్నారు.

More Telugu News