Jagityala: నిమజ్జనంలో గొడవ... పోలీసులపై రాళ్లదాడి!

  • జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఘటన
  • శ్రుతిమించిన యువకుల అల్లరి
  • అడ్డుకున్న పోలీసులపై దాడి
జగిత్యాల మెట్ పల్లిలో జరిగిన వినాయక నిమజ్జనంలో గొడవ జరుగగా, పోలీసుల వాహనంపై యువకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. పట్టణంలోని ముదిరాజ్ యువసేన, వినాయకచవితి పర్వదినం నాడు గణేశుని ప్రతిష్ఠించి, నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సందర్భంగా యువత చేస్తున్న అల్లరి శ్రుతిమించడంతో పోలీసులు కలుగజేసుకున్న వేళ ఈ ఘటన జరిగింది.

పోలీసులు, యువకుల మధ్య వాగ్వాదం జరుగగా, పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పాటు, వారి వాహనం అద్దాలను పగులగొట్టారు. తొలుత పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతో, వారు అదనపు బలగాలను పిలిపించేంత వరకూ నిరసన కొనసాగింది. బలగాలు వచ్చేసరికి యువకులు తలోదిక్కుగా పారిపోగా, ప్రత్యేక పికెటింగ్ ను పోలీసులు ఏర్పాటు చేశారు.
Jagityala
Metpalli
Police
Ganesh
Visarjan

More Telugu News