Manchu Manoj: అన్నా... అమృత వాళ్ల నాన్న ప్రేమ కనిపించట్లేదా?: ప్రశ్నకు మంచు మనోజ్ సమాధానం ఇది!

  • ప్రణయ్ పరువు హత్యపై మనోజ్ కు ప్రశ్నలు
  • పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు
  • కొన్ని ప్రశ్నలపై కటువుగా స్పందించిన మనోజ్

మిర్యాలగూడలో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్యపై తనకు ఎదురైన ఓ ప్రశ్నపై నటుడు మంచు మనోజ్ కఠినంగా స్పందించాడు. మారుతీరావుకు అనుకూలంగా ఉన్న నెటిజన్ల నుంచి వచ్చిన పలు ప్రశ్నలకు తన సోషల్ మీడియాలో ఓపికగా సమాధానాలు ఇచ్చిన మనోజ్, "అన్నా... మీకు అమృత వాళ్ల నాన్న ప్రేమ కనిపించట్లేదా?" అన్న ప్రశ్నకు ఘాటుగా సమాధానం ఇచ్చాడు. దాన్ని ప్రేమ అనరని, అది కసి, క్రూరత్వమని అన్నాడు.

తనదన్న పొగరుతో ప్రేమ పేరిట యూసిడ్ పోసేవాడికి, మారుతీరావుకు తేడా ఏంటని ప్రశ్నించాడు. అప్పట్లో భర్త మరణిస్తే, సతీ సహగమనం చేయించేవారని, దాన్ని కూడా కరెక్టే అంటారా? అని ప్రశ్నించాడు. మరో ట్వీట్ కు సమాధానంగా చంపేస్తాం, పొడిచేస్తాం అంటుంటే, పారిపోకుండా కూల్ గా ఉంటారా? ఆలోచించి, అలాంటి మూర్ఖులను ప్రోత్సహించవద్దని సలహా ఇచ్చాడు. వయసులో పెద్దవాడికి ఆ మాత్రం తెలియదా? డబ్బు ఉన్నప్పుడు కుమార్తె మనసు తెలుసుకుని అర్థం చేసుకుని ఉంటే బాగుండేదని కూడా వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News