KCR: హరీష్ రావును వదిలించుకుంటున్న కేసీఆర్: బీజేపీ

  • టీఆర్ఎస్ లో అధికమైన ఇంటిపోరు
  • సిద్ధిపేట నుంచి బరిలోకి దిగనున్న కేసీఆర్
  • మారనున్న గజ్వేల్, దుబ్బాక అభ్యర్థులు
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇంటిపోరు అధికమైందని, తన మేనల్లుడు హరీశ్ రావును కేసీఆర్ వదిలించుకునే ప్రయత్నం చేస్తూ, పొమ్మనలేక పొగబెట్టారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ ను బలి చేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకున్నారని, మెదక్ జిల్లా చేగుంటలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆరోపించారు. తాను స్వయంగా సిద్ధిపేట నుంచి పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గం అభ్యర్థులను సైతం ఆయన మార్చాలని భావిస్తున్నారని జోస్యం చెప్పారు. హరీశ్ స్థానంలో కేసీఆర్ పోటీ చేయడం ఖాయమని, ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న హరీశ్ రావు, రెండు రోజుల క్రితం, తాను గౌరవంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారని అన్నారు.
KCR
Harish Rao
TRS
RaghunandanRao
BJP

More Telugu News