Biggboss: సంచలన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్... కౌశల్ అవుట్!

షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్-2 ఎంతగా అలరిస్తుందో అందరికీ తెలిసిందే. ఈ షో హైదరాబాద్ లో సాగుతుండటం, షో కోసం పనిచేస్తున్న వారంతా ఇక్కడి వారే కావడంతో, ప్రతివారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయం ఒకరోజు ముందుగానే బయటకు వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రతివారంలానే, ఈవారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారన్న విషయమై లీక్ లు వచ్చాయి. బిగ్ బాస్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని, ఓట్లు అధికంగా వచ్చినప్పటికీ కౌశల్ ఎలిమినేట్ కానున్నాడని సమాచారం. ఓ పథకం ప్రకారం కౌశల్ ను బయటకు పంపించేందుకు బిగ్ బాస్ స్వయంగా వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారని, అందులో భాగంగానే హౌస్ లోని ఇతర పోటీదారులు కౌశల్ పై మూకుమ్మడిగా దాడి చేశారని, ఇసుక టాస్క్ లో కౌశల్ చేసిన పనిని తప్పుగా చూపించారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.

బయటి నుంచి కౌశల్ కు మద్దతిస్తున్న అభిమానుల్లో విశ్వసనీయత లేదని కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతోనే బిగ్ బాస్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తక్కువ ఓట్లు వచ్చి కౌశల్ బయటకు వెళితే ఓకేగానీ, ఎక్కువ ఓట్లు వచ్చి బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం మొత్తం షోకు ఆదరణ తగ్గిపోవడం ఖాయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Go Back to Shorts
Biggboss
Season-2
Koushal

More Telugu News