Shatrughan Sinha: బీజేపీకి షాక్.. కేజ్రీవాల్ పార్టీలోకి యశ్వంత్, శతృఘ్న సిన్హా!

  • ఏప్రిల్‌లోనే రాజీనామా చేసిన యశ్వంత్
  • ఇప్పుడు శతృఘ్న సిన్హా కూడా రెడీ
  • పార్టీలో ప్రాధాన్యం లేదనే..
కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా, బీజేపీ నేత శతృఘ్న సిన్హాలు బీజేపీకి షాకిచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరూ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేతలిద్దరూ ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. పార్టీలో తమకు ప్రాధాన్యం కరువైందన్న మనస్తాపంతోనే యశ్వంత్ సిన్హా, శతృఘ్న సిన్మాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ ఏడాది ఏప్రిల్ 21నే యశ్వంత్ సిన్హా బీజేపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ సీనియర్ నేత జస్వంత్ సింగ్ కుమారుడు మన్వేంద్ర సింగ్ కూడా తాజాగా బీజేపీకి రాజీనామా చేశారు. కాగా, యశ్వంత్ సిన్హా ఢిల్లీ నుంచి, శతృఘ్న సిన్హా పశ్చిమ ఢిల్లీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
Shatrughan Sinha
yashwant sinha
BJP
AAP
New Delhi

More Telugu News