sirsilla: సిరిసిల్లకు రైలుమార్గం తెచ్చే బాధ్యత నాది: మంత్రి కేటీఆర్

  • ఎల్లారెడ్డిపేటలో ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ శ్రీకారం
  • లక్ష ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపిస్తానంటున్నారు
  • సిరిసిల్లను పదింతలు అభివృద్ధి చేస్తా

తనకు రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల రుణం తీర్చుకుంటున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేటలో ఎన్నికల ప్రచారానికి కేటీఆర్ ఈరోజు శ్రీకారం చుట్టారు. 2006లో సిరిసిల్ల నుంచే తన రాజకీ జీవితం ప్రారంభమైన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తొలిరోజుల్లో రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని, ఈ నాలుగేళ్లలో సిరిసిల్ల రూపురేఖలు మారిపోయాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను లక్ష ఓట్ల మెజార్టీతో తనను గెలిపిస్తానని ప్రజలు చెబుతున్నారని, తనకు మెజార్టీ పిచ్చి లేదని, మెజార్టీ కాదు గెలుపు ముఖ్యమని అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తే సిరిసిల్లను పదింతలు అభివృద్ధి చేస్తానని చెప్పారు. మరోసారి తనకు అవకాశం వస్తే ప్రజలకు రుణపడి ఉంటానన్న కేటీఆర్, సిరిసిల్లకు రైలుమార్గం తీసుకొచ్చే బాధ్యత తనదని, రానున్న రోజుల్లో కేంద్రంలో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని ప్రజలు గెలిపించి.. అధికారమిస్తే కనుక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. 

More Telugu News