asaduddin owaisi: ఎవరు అబద్ధాలాడుతున్నారనే విషయాన్ని ప్రజలే తెలుసుకోవాలి: ఒవైసీ

  • హోలెండో వ్యాఖ్యలపై డిఫెన్స్‌లో బీజేపీ
  • విరుచుకు పడుతున్న విపక్షాలు
  • నిజం ఎవరు చెబుతున్నారో చెప్పాలన్న ఒవైసీ
హోలాండో అబద్ధం ఆడుతున్నారా? ప్రధాని అబద్ధాలాడుతున్నారా అనే విషయాన్ని ప్రజలే తెలుసుకోవాలని ఎంఐఎం చీఫ్, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ప్రభుత్వం సూచించిన కారణంగానే.. తమకు గత్యంతరం లేని పరిస్థితిలో డసాల్ట్ ఏవియేషన్‌కు భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ డిఫెన్స్ సంస్థను చేర్చుకోవాల్సి వచ్చిందని... నాటి ఒప్పందంపై ఇన్వెస్టిగేటివ్ న్యూస్ జర్నల్ 'మీడియా పార్ట్' ఇంటర్వ్యూలో హోలాండే సంచలన వ్యాఖ్యలు చేశారు.

దీంతో బీజేపీ డిఫెన్స్‌లో పడగా.. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకు పడుతున్నాయి. తాజాగా హోలాండే వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హోలెండే అబద్ధాలు ఆడుతున్నారా? లేదంటే మన ప్రధాని అబద్ధాలు ఆడుతున్నారా? అనే విషయాన్ని దేశ ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. నిజం ఎవరు చెబుతున్నారో రక్షణ మంత్రి చెప్పాలని తాము కోరుతున్నామని ఒవైసీ అన్నారు.
asaduddin owaisi
anil ambani
relaince
bjp

More Telugu News