Andhra Pradesh: ‘గెలుపు రొట్టె’ కోసం నెల్లూరుకు జనసేనాని.. బారాషాహిద్‌ దర్గాను దర్శించనున్న పవన్‌ కల్యాణ్‌

  • స్వర్ణాల చెరువులో పార్టీ నేతలతో రొట్టెల పండుగ
  • ఎంపిక చేసిన 50 మంది పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష
  • ఖరారు కావాల్సి ఉన్న టూర్‌ షెడ్యూల్‌
2019 ఎన్నికల్లో అధికారం దక్కించుకుంటామని చెబుతున్న జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌ ‘గెలుపు రొట్టె’ కోసం నెల్లూరుకు వెళుతున్నారు. ఈనెల 23వ తేదీన పట్టణంలోని స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగలో పాల్గొననున్నారు. తొలుత ఉదయం ఆయన అక్కడి బారాషాహిద్‌ దర్గాను దర్శించుకోనున్నారు.

అనంతరం నెల్లూరు చిల్డ్రన్ పార్క్‌ రోడ్డు అపోలో ఆసుపత్రి సమీపాన ఉన్న జెట్టి శేషారెడ్డి భవన్‌లో జిల్లా నుంచి ఎంపిక చేసిన 50 మంది ముఖ్య నేతలతో సమావేశమవుతారు. పార్టీ అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత విద్యార్థి, యువత, రైతులతో జరిగే ముఖాముఖిలో పాల్గొంటారు. పవన్‌ కల్యాణ్‌ నెల్లూరు రాక ఖరారైనా ఇంకా టూర్‌ షెడ్యూల్‌ ఖరారు కావాల్సి ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.
Andhra Pradesh
Pawan Kalyan

More Telugu News