Hyderabad: ప్రేమ, సహజీవనం తరువాత ప్రియుడికి గుర్తుకొచ్చిన కులం... హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన యువతి!

  • ఇంటర్ లో పరిచయమైన యువకుడు
  • ఏడాదిగా ప్రేమ, సహజీవనం
  • కేసు నమోదు చేసిన పోలీసులు 
ఇంటర్ చదువుతున్నప్పుడు ఏర్పడిన పరిచయాన్ని స్నేహంగా, ప్రేమగా మార్చుకున్నాడు. ప్రేమించానని మాయమాటలు చెప్పాడు. అతని మాటలు నమ్మిన ఓ యువతి సహజీవనానికి అంగీకరించింది. తన శారీరక అవసరం తీరాక, అతనిలోని అసలు రూపం బయటకు వచ్చింది. కులం పేరు చెప్పి, వివాహానికి నిరాకరించగా, ఆమె, హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, జవహర్ నగర్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగినికి 2009లో ఇంటర్ చదువుతున్నప్పుడు, ఉదయ్ శంకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. గత ఏడాదిగా వారిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అతను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె అతనితో కలిసుంది. ఈ క్రమంలో పెళ్లికై ఒత్తిడి చేయగా, తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వస్తానని నమ్మబలికి స్వగ్రామానికి వెళ్లిపోయి, స్పందించలేదు. బాధితురాలు ఫోన్ చేస్తే, కులాన్ని సాకుగా చూపాడు. అడిగినంత కట్నం ఇచ్చుకోగలవా? అని ప్రశ్నించాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన ఆమె, పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.
Hyderabad
Police
Caste
Marriage

More Telugu News