Tirumala: నేటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమాప్తం!

  • ఈ ఉదయం వైభవంగా స్నపన తిరుమంజనం
  • ముగిసిన చక్రస్నానం
  • రాత్రికి ధ్వజావరోహణతో ముగియనున్న బ్రహ్మోత్సవం

గడచిన వారం రోజులుగా తిరుమలలో వైభవంగా జరుగుతున్న శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ ఉదయం స్నామా, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు, చక్రత్తాళ్వార్ కు స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించిన అర్చకులు, చక్రస్నానాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా తిరుమల పుష్కరిణి భక్తులతో కిక్కిరిసిపోయింది. నేటి రాత్రి 8 గంటలకు ధ్వజావరోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి తిరుమలలో అన్ని రకాల ఆర్జిత సేవలూ రద్దయిన సంగతి తెలిసిందే.

రేపటి నుంచి ఆర్జిత సేవలు పునఃప్రారంభం కానున్నాయి. టైమ్ స్లాట్ టోకెన్లను నేటి నుంచి జారీ చేయనున్నామని టీటీడీ అధికారులు ప్రకటించారు. కాగా, ఈ ఉదయం తిరుమలలో శ్రీవారి దర్శనార్థం ఎనిమిది కంపార్టుమెంట్లలో భక్తులు వేచివుండగా, దర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. సర్వ, దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు రెండు గంటల సమయం పడుతోంది.

More Telugu News