Harish Rao: పంతాలు, పట్టింపులకు పోయి బిడ్డల ఉసురు తీయకండి!: మంత్రి హరీశ్ రావు

  • నాగరికతతో పాటు నడుద్దాం
  • కుల విద్వేషాలకు దూరంగా ఉందాం
  • కుల వివక్ష ఒక సామాజిక రుగ్మత

తెలంగాణలోని మిర్యాలగూడలో ఇటీవల జరిగిన పరువు హత్య మరవక ముందే, హైదరాబాద్ లో నిన్న మరో దాడి ఘటన చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరువు హత్యలకు పాల్పడవద్దని సూచిస్తూ మంత్రి హరీశ్ రావు వరుస ట్వీట్లు చేశారు.

నాగరికతతో పాటు నడుద్దాం.. కుల విద్వేషాలకు దూరంగా ఉందాం.. కుల వివక్ష ఒక సామాజిక రుగ్మత. అదొక అనాగరిక పరంపర. నాగరిక సమాజాల్లో అలాంటి వివక్షకు తావులేదు. కులం పేరుతో జరిగే హింస మానవతకి మచ్చ. పెళ్లి ద్వారా రెండు కులాలు కలుస్తున్నాయంటే అదొక సామాజిక వేడుక కావాలి. అంతరాలను అంతం చేసే ఆ ముందడుగును స్వాగతించాలి. ఎదిగిన బిడ్డల స్వేచ్ఛని గౌరవించాలి. పంతాలు, పట్టింపులకు పోయి బిడ్డల ఉసురు తీయకండి. ప్రాణాలు తీయడాన్ని మించిన పరువు తక్కువ పని మరొకటి లేదని గుర్తించండి’ అని హరీశ్ రావు సూచించారు.

More Telugu News