gulshan kumar: గుల్షన్ కుమార్ బయోపిక్‌లో ఆమిర్‌ఖాన్!

  • ‘క్యాసెట్ కింగ్’ బయోపిక్‌పై దృష్టి పెట్టిన ఆమిర్
  • నాలుగు వారాలుగా స్క్రిప్ట్‌పై కసరత్తు
  • ‘ముఘల్’ అనే టైటిల్‌ ఖరారు
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌ల హవా నడుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల వారూ బయోపిక్‌లకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రముఖ కథానాయకులు కూడా బయోపిక్‌ల వైపే మొగ్గు చూపుతున్నారు. బాలీవుడ్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమిర్‌ఖాన్ ‘క్యాసెట్ కింగ్’ బయోపిక్‌‌లో నటించనున్నట్టు తెలుస్తోంది.

క్యాసెట్ కింగ్ ఎవరా.. అనుకుంటున్నారా? సంగీత పరిశ్రమలో అద్భుతాలు సృష్టించిన గుల్షన్ కుమార్. ఆయన నెలకొల్పిన టీ సిరీస్ కంపెనీ క్యాసెట్లు విరివిగా అమ్ముడుపోయేవి. దీంతో ఆయనకు ఆ పేరు వచ్చింది. నిర్మాత సుభాష్ కపూర్‌తో కలిసి ఆమిర్ నాలుగు వారాలుగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టుపై కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ముఘల్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. గుల్షన్ కుమార్ కుమారుడు భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. 
gulshan kumar
mughal
amir khan
subhash kapoor
bolly wood

More Telugu News