కోహ్లీకి ‘రాజీవ్ ఖేల్ రత్న’ను ప్రకటించిన కేంద్ర క్రీడాశాఖ
- కోహ్లీని వరించిన అత్యున్నత పురస్కారం
- నీరజ్ చోప్రా, హిమాదాస్, స్మృతి మంధానకు ‘అర్జున’
- ఈనెల 25న అందజేయనున్న రాష్ట్రపతి
ఈ ఏడాది నలుగురికి థ్యాన్‌చంద్, ఎనిమిది మందికి ద్రోణాచార్య, 20 మందికి అర్జున పురస్కారాలను క్రీడాశాఖ ప్రకటించింది. ఖేల్ రత్న గ్రహీతలకు రూ.7.5 లక్షలు, అర్జున, ద్రోణాచార్య, థ్యాన్ చంద్ అవార్డు గ్రహీతలకు రూ.5 లక్షల చొప్పున నగదు బహుమతిని అందజేస్తారు. ఈ నెల 25న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ పురస్కారాలను అందజేయనున్నారు.