venkatesh: ఆర్మీ కల్నల్ పాత్రలో వెంకటేశ్!

  • 'ఎఫ్ 2' షూటింగుతో వెంకీ బిజీ 
  • కొత్త దర్శకుడితో మల్టీస్టారర్ 
  • మరో హీరోగా దుల్కర్ సల్మాన్

ప్రస్తుతం వెంకటేశ్ .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' అనే మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత వెంకటేశ్ మరో మల్టీస్టారర్ చేయనున్నారు. ఈ సినిమాలో ఒక హీరోగా దుల్కర్ సల్మాన్ నటించనుండగా .. మరో హీరోగా వెంకటేశ్ కనిపించనున్నారు.

ఈ సినిమాలో వెంకటేశ్ పాత్ర ఏమై వుంటుందనే ఆసక్తి అభిమానుల్లో వుంది. ఆయన ఈ సినిమాలో ఆర్మీ కల్నల్ గా కనిపించనున్నారనేది తాజా సమాచారం. యుద్ధం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట. ఆర్మీ కల్నల్ గా వెంకటేశ్ పాత్రకి చాలా ప్రాధాన్యత వుంటుందట. అందువల్లనే ఆయన ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. కొత్త దర్శకుడితో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.  

More Telugu News