Telangana: ప్రణయ్‌ హత్యలో రాజకీయ కుట్ర కోణం: టీజేఎస్‌ నాయకుడు అంబటి శ్రీనివాస్‌

  • హంతకులపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
  • సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి
  • టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేదు

ప్రణయ్‌ హత్య కేవలం ఓ తండ్రి కూతురిపై ప్రేమతో చేసింది కాదని, దీని వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని టీజేఎస్‌ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి అంబటి శ్రీనివాస్‌ ఆరోపించారు. నర్సంపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రణయ్‌, అమృతలు తమకు రక్షణ కల్పించాలని మిర్యాలగూడ పోలీసులను వేడుకున్నా పట్టించుకోలేదన్నారు.

పైగా తాజా మాజీ ఎమ్మెల్యే వీరేశం, న్యాయవాది భరత్‌కుమార్‌లు ప్రేమజంటను బెదిరించేవారన్నారు. ఇవన్నీ కుట్రలో భాగమేనని ఆరోపించారు. ప్రణయ్‌ని హత్యచేసిన మారుతీరావు, అతని సోదరుడు, సహకరించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.  కేసీఆర్‌ పాలనలో ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేదనేందుకు జరుగుతున్న ఘటనలే ఉదాహరణ అని చెప్పారు.  

  • Loading...

More Telugu News