కుమార్తెను తెగనరికే ముందు పూటుగా మందుకొట్టిన మనోహరాచారి!
- ముందు నుంచే పక్కా ప్లాన్ వేసుకున్న మనోహరాచారి
- దాడికి ముందు బార్ కు వెళ్లి ధైర్యం తెచ్చుకున్న చారి
- ఆపై దర్జాగా పారిపోగా, అరెస్ట్ చేసిన పోలీసులు
ఇంట్లో పని ఉందని తాను పనిచేస్తున్న షాపు యజమానికి చెప్పి బయటపడ్డ చారి, అక్కడే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ లో పూటుగా మందు కొట్టాడు. కుమార్తె, అల్లుడు వచ్చి, ఫోన్ చేయడంతో నేరుగా వారిదగ్గరికి వెళ్లి, ఆ వెంటనే దాడికి దిగాడు. రోడ్డున పోయేవారు చూస్తున్నారన్న భయం లేకుండా, చేతిలో ఉన్న కొడవలిని అటూ ఇటూ తిప్పి, చుట్టూ ఉన్నవారిని బెదిరిస్తూ దాడికి దిగాడు. దాడి చేసిన అనంతరం పారిపోయిన మనోహరాచారి, బీఎస్ మక్తాలోని తన బంధువుల ఇంట్లో ఉండగా, పోలీసులు అరెస్ట్ చేశారు. చారిని నేడు కోర్టు ముందు హాజరు పరచనున్నట్టు పోలీసులు తెలిపారు.