Mumbai: గాయపడిన పాముకు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ చేసి కాపాడిన లేడీ డాక్టర్!

  • ముంబైలోని ఓ ఇంట్లోకి ప్రవేశించిన పాము
  • కర్రతో కొట్టడంతో విరిగిన వెన్నెముక
  • చికిత్స చేసి కాపాడిన డాక్టర్ దీప

ఓ వ్యక్తి కొట్టడంతో తీవ్రంగా గాయపడి వెన్నెముక విరిగిన స్థితిలో కదల్లేకుండా ఉన్న అరుదైన పాముకు చికిత్సను అందించిన ఓ లేడీ డాక్టర్, ఆ పామును కోలుకునేలా చేశారు. ఈ ఘటన ముంబైలో జరిగింది. దహిసర్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లోకి ఆకుపచ్చని రంగులో ఉన్న అరుదైన పాము ఒకటి ప్రవేశించింది. ఓ వ్యక్తి దాన్ని కర్రతో కొట్టాడు. దీంతో పాము తీవ్రంగా గాయపడింది.

విషయం తెలుసుకున్న పాముల రక్షకుడు వైభవ్ పాటిల్, దాన్ని ఆసుపత్రికి చేర్చారు. లేడీ డాక్టర్ పీదా కత్యాల్, పాముకు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ తదితరాలు చేసి, వెన్నెముక విరిగిందని తేల్చారు. పాముకు పెయిన్ కిల్లర్స్ ఇచ్చి, కోల్ లేజర్ చికిత్సను అందించారు. దీంతో పాము మెల్లగా కోలుకుని, ప్రస్తుతం కొద్దికొద్దిగా కదులుతోందని డాక్టర్ దీప వెల్లడించారు.

More Telugu News